జిమ్ లో వర్కవుట్ తో నెటిజన్లకి చెమటలు పట్టిస్తున్న అశ్వినిశ్రీ!
on Jul 8, 2024
సెలెబ్రిటీలు రోజుకో రీల్ తో, వ్లాగ్స్ తో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండటానికి ట్రై చేస్తుంటారు. అయితే అలా లేకపోతే ఇండస్ట్రీలో అవకాశాలు తక్కువే.. ఎంత ట్రెండింగ్ లో ఉంటే అంత ఫాలోయింగ్.. అన్ని ఆఫర్లు వస్తుంటాయి. మరి వాటి కోసం వాళ్ళు పడే కష్టం మాములుగా ఉండదు.
అలా ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండాలని అందాలు ఆరబోస్తున్న వారి లిస్ట్ లో అశ్వినిశ్రీ ముందు వరుసలో ఉంది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ గా అడుగుపెట్టిన అశ్వినిశ్రీ బాగా క్రేజ్ తెచ్చుకుంది. అశ్వినిశ్రీ తెలుగమ్మాయి. 1989 జూలై 12 న అశ్విని శ్రీ జన్మించింది. ఈమె హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. అయితే మొదటగా తను షార్ట్ ఫిల్మ్ లలో నటించింది. వాటితో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో సినిమాల్లోకి వచ్చింది. 2016 లో వెండితెరపై అరంగేట్రం చేసింది అశ్విని. సంపూర్ణేశ్ బాబు హీరోగా చేసిన "వినోదం 100 పర్సెంట్" అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. ఆ తర్వాత 2017 లో వచ్చిన "అమీర్ పేటలో", 2018 లో వచ్చిన " బిటెక్ బాబులు" , 2020 లో " నువ్వు నేను, ఒసేయ్ ఒరేయ్" వంటి సినిమాలల్లో నటించింది అశ్విని.
అశ్వినిశ్రీకి ఇన్ స్టాగ్రామ్ లో చేసే రీల్స్, ఫోటోలకి ప్యాన్ బేస్ గట్టిగానే ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో 649K ఫాలోవర్స్ ని కలిగి ఉంది. కొన్ని రోజుల క్రితం బల్కంపేట్ రేణుక ఎల్లమ్మ టెంపుల్ కి వెళ్ళిన అశ్వినిశ్రీ అక్కడ బోనం ఎత్తుకొని చేసిన రీల్ 2.1 మిలయన్ వ్యూస్ దాటింది. ఇక తాజాగ తను జిమ్ లో వర్కవుట్ చేస్తూ ఓ రీల్ ని షేర్ చేసింది. ఇందులో అందాలు ఆరబోస్తూ జిమ్ డ్రెస్ ని వేసుకొని కనపడగా సోషల్ మీడియాలోని కొంతమంది నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. లెజెండ్ ఫోకస్ ఆన్ కాస్ట్యూమ్, బ్యూటిఫుల్ అంటు కొందరు కామెంట్లు చేయగా.. నీతో పాటు చూసే మాకు చెమటలు పడుతున్నాయంటూ కొంతమంది అంటున్నారు. మరికొందరు అయితే మరీ వల్గర్ గా కామెంట్లు చేస్తున్నారు. ఇక అలా చెడుగా కామెంట్ చేసే వాళ్ళ కామెంట్లని హైడ్ లో పెడుతుంది అశ్వినిశ్రీ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.
Also Read